జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం

జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం

యేసుకు సాటి ఎవ్వరు లేరనే ఒక సత్యం (2)

సంతృప్తిని సమృద్ధిని అనుభవిస్తున్నా….

ఆకాశమే సరిహద్దుగా సాగిపోతున్నా …..

1. ఏర్పరచుకున్నాను ఒక లక్ష్యం

     నిరతము యేసునే స్తుతియించాలని

     కూడగట్టుకున్నాను శక్తంతయూ

     నిరతము యేసునే చాటించాలని

     ఆ యేసే నిత్య రాజ్యము – ఆ యేసే గొప్ప సత్యము (2)

2. నిర్మించుకున్నాను నా జీవితం

     సతతము యేసులో జీవించాలని

     పయనిస్తు ఉన్నాను నా బ్రతుకులో

     యేసయ్య చిత్తమును జరిగించాలని

     ఆ యేసే సత్య మార్గము – ఆ యేసే నిత్య జీవము (2) 

(Jeevithamlo Nerchukunnaanu Oka Paatam)