జీవింతు నేను ఇకమీదట – నా కొరకే కాదు

జీవింతు నేను ఇకమీదట – నా కొరకే కాదు యేసు కొరకే జీవింతును (2)

నన్ను ప్రేమించిన – ప్రియ యేసు కొరకే

నాకై ప్రాణమిచ్చిన – ప్రభు యేసు కొరకే

జీవింతును జీవింతును – జీవింతును జీవింతును (2) 

1. నీ ఉన్నత పిలుపుకు లోబడదున్ – గురివైపునకే

బహుమానము పొందగ పరుగిడుదున్

వెనుకవున్నవన్నీ మరతును – ముందున్నవాటి కొరకే నే వేగిరపడుదును (2)

నన్ను ప్రేమించిన యేసుని చూతును – నాకై ప్రాణమిచ్చిన ప్రభుని వెంబడింతును

గురి వైపుకే – పరుగెడుదును – వెనుదిరుగను – వెనుదిరుగను (2)

2. శ్రమయైనా బాధైననూ – హింసయైనా – కరువైనా ఎదురైననూ

ఉన్నవైన రాబోవునవైనా – అధికారులైనా – ఎతైనా లోతైననూ (2)

నన్ను ఎడబాపునా ప్రభు ప్రేమనుండి – నేను విడిపోదునా ప్రభు నీడనుండి

జీవింతును – నా యేసుతో – జయమిచ్చును – నా యేసుడే (2)

(Jeevinthu Nenu Ikameedata Naa Korake Kaadu Kreesthukoraku Jeevinthunu)