చూడుము గెత్సేమనే – తోటలో నా ప్రభువు
పాపి నాకై వి-జ్ఞాపన చేసెడి – ధ్వని వినబడుచున్నది
పాపి నీకై వి-జ్ఞాపన చేసెడి – ధ్వని వినబడుచున్నది
1. దేహమంతయు నలగి – శోకము చెందినవాడై
దేవాది దేవుని – ఏకైక సుతుడు పడు వేదనలు నా కొరకే
2. తండ్రి ఈ పాత్ర తొలగున్ – నీ చిత్తమైన యెడల
ఎట్లయినను నీ – చిత్తము చేయుటకు నన్నప్పగించితివనెను
3. రక్తపు చెమట వలన – మిక్కిలి బాధనొంది
రక్షకుడేసు – హృదయము పగలగ – విజ్ఞాపనము చేసెనే
4. ముమ్మారు భూమిమీద – పడి మిక్కిలి వేదనచే
మన యేసు ప్రభువు – తానే వేడుకొనెను – పాపుల విమోచన కొరకే
(Chudumu Gethsemane Thotalo Naa Prabhuvu)