చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా (2)
నా తోడు నీవయ్యా – నీ స్నేహం చాలయ్యా
నా నీడ నీవయ్యా – ప్రియ ప్రభువా యేసయ్యా
చిరకాల స్నేహం – ఇది నా యేసు స్నేహం (2)
1. బంధువులు వెలివేసినా వెలివేయని స్నేహం
లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసు నీ స్నేహం (2)
2. కష్టాలలో కన్నీళ్లలో నను మోయు నీ స్నేహం
నను ధైర్యపరచి ఆదరణ కలిగించు – నా యేసు నీ స్నేహం (2)
3. నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం
కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం నా యేసు నీ స్నేహం (2)
(Chirakaala Snehithudaa Naa Hrudayaana Sannihithudaa)