గొఱ్రెల గొప్ప కాపరి నా యేసు

గొఱ్రెల గొప్ప కాపరి నా యేసు
మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు (2)
మంచి కాపరి ప్రధాన కాపరి – ప్రేమ కాపరి నిత్య కాపరి (2)

1. తప్పిపోయిన నన్ను వెదకుట కొరకు
దారి తప్పిన నన్ను రక్షించుటకు (2)
కొండలు కోనలు దాటాడు – లోయలు లోతులు వెదికాడు (2)

2. జబ్బుపడి నేనున్నపుడు అక్కున చేర్చాడు
మబ్బుపట్టి వున్నపుడు గొర్రెల పాకకు నడిపాడు (2)
పచ్చిక బయళ్ళో మేపాడు – శాంతి జలములకు నడిపాడు (2)

3. ఎండవేళలో నన్ను నీడకు నడిపాడు
చీకటి వేళలో నన్ను వెలుగుకు నడిపాడు (2)
ఎన్నడు నన్ను వీడడు – ఎప్పుడు నాతో వుంటాడు (2)

(Gorrela Goppa Kaapari Naa Yesu Manda Koraku)