గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడవని

గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడవని – గళమెత్తి నిన్ను నేను గానమాడెదన్

రాజుల రాజువని రక్షణ దుర్గమని – నీ కీర్తిని నేను కొనియాడెదన్

హల్లెలూయా నా యేసునాథా – హల్లెలూయా నా ప్రాణనాథా (2)

1. అద్భుత క్రియలు చేయువాడని – ఆశ్చర్య కార్యాలు చేయగలడని (2)

అద్వితీయుడవని ఆదిసంభూతుడని – ఆరాధించెద నిత్యం నిన్ను (2)     

2. సాగరాన్ని రెండుగా చేసినాడని – సాతాను శక్తులను ముంచినాడని (2)

సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని – సాక్ష్య గీతం నే పాడెదన్ (2)   

(Goppa Devudavani Shakthi Sampannudavani Galametthi Ninnu Nenu)