గీతం గీతం జయ జయ గీతం చేయితట్టి పాడెదము
యేసు రాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము
1 చూడు సమాధిని మూసిన రాయి దొరలుచు పరులిడెను
అందువేసిన ముద్ర కావలినిల్చెను నా దైవసుతుని ముందు
2 వలదు వలదు ఏడువవలదు వెళ్ళుడి గలిలయకు
తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రచురించుడి
3 అన్నకయప వారలసభయును అదరుచు పరుగిడిరి
ఇంక భూతగణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి
4 గుమ్మముల్ తెరచి చక్కగా నడువుడి జయవీరుడు రాగా
మీ మేళతాళ వాద్యముల్ బూరలెత్తి ధ్వనించుడి
(Geetham Geetham Jaya Jaya Geetham Cheyithatti Paadedamu)