గాయములన్ గాయములన్ మన కొరకై పొందెను క్రీస్తు ప్రభు
1. సురూపమైన సొగసైన లేదు దుఃఖ భరితుడాయెను
వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమొందె వీక్షించి త్రిప్పిరి ముఖముల్
2. మన రోగములను మన దుఃఖములను మనకై తానే భరియించే
మొత్తబడెను బాధింపబడెను ఎంతో శ్రమనొందె మనకై
3. మనయతిక్రమ క్రియలను బట్టి మరినలుగ గొట్టబడెను
తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగె మనకు
4. పాపంబు కపటంబు లేదు ప్రభునందు మౌనం వహియించె మనకై
ప్రాణంబు మనకై ప్రియముగనర్పించె ప్రభువే ఘోరసిలువపై
5. క్రీస్తు ప్రేమను మరువ జాలము ఎంతో ప్రేమించే మనల
సిలువపై మనము గమనింప మనకు విలువైన విడుదల కలిగె
(Gaayaamulan Gaayaamulan Mana Korakai Pondenu Kreesthu Prabhu)