గాయపడిన నీ చేయి చాపుము దేవా

గాయపడిన నీ చేయి చాపుము దేవా

నీ సిలువ రక్తమును ప్రోక్షించుము నా ప్రభువా (2)

సిలువే నాకు విలువైనది (2)

అదియే నా బ్రతుకున గమ్యమైనది – ఎంతో రమ్యమైనది

1. ఎండిన భూమిలో మొలచిన లేత – మొక్క వలె నీవు ఎదిగితివి (2)

సురూపమైనా ఏ సొగసైనా (2)  లేనివానిగా నాకై మారితివి

2. మనుషులందరు చూడనొల్లని – రూపముగా నాకై మారితివి (2)

మా రోగములు మా వ్యసనములు (2)  నిశ్చయముగా నీవు భరియించితివి

3. నీవు పొందిన దెబ్బల వలన స్వస్థత నాకు కలిగినది (2)

నీవు కార్చిన రక్తమే (2) మా అందరికీ ఇల ప్రాణాధారము

(Gaayapadina Nee Cheyi Chaapumu Devaa Nee Siluva Rakthamunu)