గలిలయ తీరాన చిన్న నావ

గలిలయ తీరాన చిన్న నావ

యేసయ్య ఏర్పరచు-కున్న నావ (2)

యేసయ్య సేవలో వాడబడిన

యేసయ్య బోధకు ఉపయోగపడిన

ఆ నావలా నేనుంటే చాలునయ్యా 

1. యేసయ్య రాకకై ఎదురు చూసిన

యేసయ్యను మోస్తూ పరవశించిన (2)

ఆత్మల సంపాదనకై వాడబడిన

ఆశ్చర్య కార్యములెన్నో చూసిన

ఆ నావలా నిన్ను మోస్తే చాలునయ్యా

2. సుడిగుండాలెన్నో ఎదురొచ్చినా

పెనుతుఫానులెన్నో అడ్డొచ్చినా (2)

ఆగకుండా ముందుకే కొనసాగిన

అలుపెరగని సేవకై సిద్ధపడిన

ఆ నావలా నన్ను కూడా వాడుమయ్యా 

(Galilaya Theeraana Chinna Naava)