క్రొత్త యేడు మొదలు బెట్టెను మన బ్రతుకునందు
క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త యేట బ్రభుని సేవ
దత్తర పడకుండ జేయు టుత్తమోత్తమంబు జూడ
1. పొంది యున్న మేలు లన్నియు
బొంకబు మీఱ డెందమందు స్మరణ జేయుడీ
యిందు మీరు మొదలు బెట్టు పందెమందు గెల్వ వలయు
నందముగను రవినిబోలి నలయకుండ మెలయకుండ
2. మేలు సేయ దడ వొనర్పగా
మీరెఱుగునట్లు కాలమంత నిరుడు గడచెగా
ప్రాలుమాలి యుండకుండ జాల మేలు సేయవలయు
జాల జనముల కిమ్మాను యేలు నామ ఘనతకొఱకు
3. బలము లేని వార మయ్యును
బల మొంద వచ్చు గలిమి మీఱ గర్త వాక్కున
నలయకుండ నలగకుండ మోద మొంది
బల మొసంగు సర్వవిధుల నెలమి మీ రొనర్చుచుండ
4. ఇద్ధరిత్రి నుండు నప్పుడే
యీశ్వరుని జనులు వృద్ధిబొంద జూడవలయును
బుద్ధి నీతి శుద్ధులందు వృద్ధినొంద శ్రద్ధజేయ
శుద్ధు లైన వారిలో ప్ర సిద్ధు లగుచు వెలుగ వచ్చు
5. పాపపంక మంటినప్పుడు
ప్రభు క్రీస్తు యేసు ప్రాపు జేరి మీరు వేడగా
నేపుమీఱ దనదు కరుణ బాప మంత గడిగివేసి
పాపరోగ చిహ్న లన్ని బాపివేసి శుద్ధి జేయు
(Krottha Yedu Modalubettenu Mana Brathukunandu)