క్రైస్తవుడా – సైనికుడా – బలవంతుడా – పరిశుద్ధుడా
కదలిరావోయ్ – నీవు కదలిరా
జాలరి మనుష్యుల పట్టు జాలరీ … ఆత్మల కాయు కాపరీ
అమృతమంధించే ఆచారీ యేసుకై జీవించే పూజారి
1. సిలువే నీ స్థావరము – శ్రమలే నీ సైన్యము
సహనమే నీ ధైర్యము – సాక్ష్యమే నీ సైన్యము
2. త్యాగమే నీ క్షేమము – ప్రార్థనే నీ యవ్వనము
వాక్యమే నీ బాణము – విశ్వాసమే ఉద్యమము
3. సత్యమే నీ గమ్యము – సమర్పనయే నీ శీలము
యేసే నీ కార్యక్రమము – ప్రేమే నీ పరాక్రమము
4. దేశంలో విదేశం లో – గ్రామంలో కుగ్రామంలో
అడవులలో కొండలలో – పనిఎంతో ఫలమెంతో
5. సిద్ధాంతపు గట్టు దుమికిరా – సాకులనే మెట్టులు దిగిరా
దీనుడా కాదు ధన్యుడా – విదేయుడా అజేయుడా
6. వాగ్దానపు భూమి స్వతంత్రించుకో – అధ్వాన్నపు అడవి దాటి ముందుకు పో
నీ ఇల్లే పెనూయేలు – నీ పేరే ఇశ్రాయేలు
(Kraisthavudaa Sianikudaa Balavanthudaa Parishuddhudaa)