కల్వరిగిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా

కల్వరిగిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా

నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా

1. తుంటరులంత పట్టి కట్టి

తిట్టుచు నిన్ను కొట్టిర తండ్రీ –  తిట్టుచు నిన్ను కొట్టిర తండ్రీ

నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా

2. మూడు దినముల్ సమాధిలో

ముదముతోడ నిద్రించితివా – ముదముతోడ నిద్రించితివా

నా రక్షణకై సజీవముతో సమాధిన్ గెల్చి లేచిన తండ్రి

3. ఆరోహణమై వాగ్దానాత్మన్

సంఘముపైకి పంపించితివా – ఆదరణాత్మన్ పంపించితివా

నీ రాకడకై నిరీక్షణతో నిందలనెల్ల భరించెదను

(Kalvarigiripai Siluva Bhaaram Bharinchithivaa O Naa Prabhuvaa)