కలువరిగిరిలో సిలువధారియై
వ్రేలాడితివా నా యేసయ్యా (2)
1. అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షను
ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా (2)
నా దోషక్రియలకై సిలువలో బలి అయితివా
నీ ప్రాణ క్రయ ధనముతో రక్షించితివా (2)
2. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను
ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను (2)
ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి
నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా (2)
(Kaluvarigirilo Siluvadhaariyai Vrelaadithivaa Naa Yesayya)