ఓ ప్రభువా… ఓ ప్రభువా… – నీవే నా మంచి కాపరివి (4)
1. దారి తప్పిన నన్నును నీవు – వెదకి వచ్చి రక్షించితివి (2)
నిత్య జీవము నిచ్చిన దేవా (2) – నీవే నా మంచి కాపరివి (4)
2. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని – ఎల్లప్పుడు చేయి విడువక (2)
అంతము వరకు కాపాడు దేవా (2) – నీవే నా మంచి కాపరివి (4)
3. ప్రధాన కాపరిగా నీవు నాకై – ప్రత్యక్షమగు ఆ ఘడియలో (2)
నన్ను నీవు మరువని దేవా (2) – నీవే నా మంచి కాపరివి (4)
(O Prabhuvaa O prabhuvaa Neeve Naa Manchi Kaaparivi)