ఎవరో తెలుసా యేసయ్యా
చెబుతా నేడు వినవయ్యా
పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి
రక్షణ పొందయ్యా (2)
1. దేవాది దేవుడు యేసయ్యా
మానవ జన్మతో వచ్చాడయ్యా (2)
మరణించాడు మరి లేచాడు
నీ నా పాప విమోచనకై (2) “ఎవరో”
2. ధనవంతుడై యుండి యేసయ్యా
దరిద్రుడై ఇల పుట్టాడయ్యా (2)
రూపు రేఖలు కోల్పోయాడు
నీ నా పాపవిమోచనకై (2) “ఎవరో”
3. పాపుల రక్షకుడేసయ్యా
కార్చెను రక్తము పాపులకై (2)
తన దరి చేరిన పాపులనెల్ల
కడుగును తనదు రక్తముతో (2) “ఎవరో”
4. యేసే దేవుడు ఎరుగవయ్యా
రాజుల రాజుగా వస్తాడయ్యా (2)
నమ్మినవారిని చేర్చును పరమున
నమ్మని వారికి నరకమేగా (2) “ఎవరో”
5. యేసుని తరుపున ప్రతినిధినై
దేవుని ప్రేమకు ప్రతిరూపమై (2)
అతి వినయముగా బతిమాలుచున్నాను
నేడే నమ్ముము ప్రభు యేసుని (2) “ఎవరో”
(Yevaro Thelusaa Yesayyaa Chebuthaa Nedu Vinavayyaa)