ఎల్లవేళలా ఆరాధించెదన్ యేసు రాజుని

ఎల్లవేళలా ఆరాధించెదన్ యేసు రాజుని

నేను స్తుతియించి పాడెదను ఒక నూతన గీతము (2)

నీకే ఆరాధనా (4) హల్లెలూయ (4) అని పాడెదన్

హల్లెలూయ (4) అని పాడెదన్

1. గాఢాంధ కారములో నేను నడచినను – నా తోడు నీవై నన్ను నడిపితివి

     శ్రమలెన్ని అయినా వేదనలు వొచ్చిన – నా బలము నీవై నన్ను నడిపితివి (2)

ఇరుకైన ఇబ్బందిలో నా తోడు నీవయ్యా –

ఏ వేదన నన్ను చుట్టకుండా కాపాడుమయ్య

     నీకే ఆరాధనా (4) హల్లెలూయ (4) అని పాడెదన్ –

     హల్లెలూయ (4) అని పాడెదన్                                                    ||ఎల్లవేళలా ||

2. నా వారే నన్ను నిందించు చున్నను – నీ మాటే నన్ను ఓదార్చెను

     ప్రేమించే వారే దూషించు చున్నను – నీ ప్రేమే నన్ను బలపరచెను

ఎవరున్నా లేకున్నా నీవే చాలయ్య

ఏ వేదన నన్ను చుట్టకుండా కాపాడుమయ్య

     నీకే ఆరాధనా (4) హల్లెలూయ (4) అని పాడెదన్

     హల్లెలూయ (4) అని పాడెదన్                                                    ||ఎల్లవేళలా ||

(Yellavelalaa Aaraadhinchedan Yesu Raajuni)