ఎన్ని తలచినా ఏది అడిగినా

ఎన్ని తలచినా ఏది అడిగినా – జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా

నీ వాక్కుకై వేచియుంటిని – నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా

1. నీ తోడు లేక నీ ప్రేమ లేక – ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2)

అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2) – నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా

2. నా ఇంటి దీపం నీవే అని తెలసి – నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2)

ఆరిపోయిన నా వెలుగు దీపము (2) – వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా

3. ఆపదలు నన్ను వెన్నంటియున్నా – నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2)

లోకమంతయూ నన్ను విడచినా (2) – నీ నుండి వేరు చేయవు (2) ప్రభువా

4. నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి – నా కొరకై కల్వరిలో యాగమైతివి (2) 

నీదు యాగమే నా మోక్ష మార్గము (2) – నీయందే నిత్యజీవము (2) ప్రభువా

(Yenni Thalachinaa Yedi Adiginaa Jarigedi Nee Chitthame Prabhuvaa)