ఎందుకో నన్ను నీవు ఎన్నుకున్నావు – ఏ మంచిలేని నన్ను నీవు కోరుకున్నావు
ఆ ప్రేమకు ఫలితం సిలువ త్యాగమా – ఆ ప్రేమకు అర్థం బలి దానమా
1. నిన్నెరుగక ఆనాడు దూషించి తిరిగితిని
నీ మహిమను నే కానక అవమాన పరచితిని
నా కరములు నీవు వీడక కాపాడినది – ఈ దీనుని ధన్యునిగా చేయాలనా
2. ఘోర వ్యాధితో నేను రోదించిన వేళలో
దరిరాలేదెవ్వరూ నన్నాదరింపగను
ఇలలో దొరకని ప్రేమను చూపించినది – నా స్వామీ నీ సాక్షిగా ఉండాలనా
3. నా పాప కాడి క్రింద నలిగిపోతిని – కలువరిలో నా కొరకు కరిగిపోతివి
ఈ పాపిని పరిశుద్ధులలో చేర్చాలనా – పరమ పురికి నా నావ సాగాలనా
(Yenduko Nannu Neevu Yennukunnaavu Ye Manchileni Nannu Neevu Korukunnaavu)