ఎంత సుందరమో ఆ పరలోకము అంతా సువర్ణమే ఏమి చిత్రము.
చేరాలనుకుంటే ఆ పట్టణము యేసయ్యకివ్వాలి నీ హృదయము.
1. కాంతినిచ్చుటకు సూర్యుడు – అవసరమే లేదు
వెన్నెలిచ్చుటకు చంద్రుడు – అవసరమే లేదు (2)
దేవుని మహిమయె అచట ప్రకాశించుచుండును (2)
జనములు ఆ వెలుగునందు సంచరించు చుందురు (2)
2. ఆకలి దాహము ఉండనే ఉండవు
చీకటి రోగము ఉండనే ఉండవు (2)
ప్రభువైన దేవుడే వారితో నివసించును (2)
కన్నీటి బిందువులను తానే తుడిచివేయును (2)
3. శాపగ్రస్తమైనదేది అందులో ఉండదు
అసహ్యమైనది ఏది అందులో ఉండదు (2)
జీవగ్రంధమందు రాయబడిన వారే ఉందురు (2)
ఆయనను సేవించుచు రాజ్యమే చేతురు (2)
(Yentha Sundaramo Aa Paralokamu Anthaa Suvarname Yemi Chitramu)