ఎంత మధురము యేసుని ప్రేమ – ఎంత మధురము నా యేసుని ప్రేమ
ప్రేమా – ప్రేమా – ప్రేమా – ప్రేమా
అ!!ప!! బంధము తెంచెను – బ్రతికించెను నన్ను
1. అంధకార బంధము నన్నావరింపగా
అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని !! బంధము!!
2. రక్షించువారు లేక పక్షినైతిని
భక్షకుడు బాణము గురిపెట్టి యుండెను !! బంధము!!
3. ఎన్నో పాపములు చేసి మూటకడితిని
ఎన్నో దోషములు చేసి దోషినైతిని !! బంధము!!
(Yentha Madhuramu Yesuni Prema)