ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా

ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా – చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన

నా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన (2)

1. సంతోషం ఎక్కడ ఉందనీ – సమాధానం ఎచ్చట నాకు దొరికేననీ (2)

జగమంతా వెదికాను జనులందరినడిగాను (2)

చివరికది నీలోనే కనుగొన్నాను (2)

2. ప్రేమనేది ఎక్కడ ఉందనీ – క్షమనేది ఎచ్చట నాకు దొరికేననీ (2)

బంధువులలో వెదికాను స్నేహితులను అడిగాను (2)

చివరికది నీలోనే కనుగొన్నాను (2)

3. సత్యమనేది ఎక్కడ ఉందనీ – నిత్యజీవం ఎచ్చట నాకు దొరికేననీ (2)

ఎందరికో మొక్కాను ఏవేవో చేసాను (2)

చివరికది నీలోనే కనుగొన్నాను (2)

(Yentha Manchi Devudavayyaa Yesayyaa Chinthalanni Theerenayyaa Ninnu Cherina)