ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా
చింతలన్ని తీరేనయ్యా నిను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా (2)
1. ఘోరపాపినైన నేనూ – దూరంగా పారిపోగా (2)
నీ ప్రేమతో నను క్షమియించి నను హత్తుకొన్నావయ్యా (2)
2. నాకున్న వారందరూ – నను విడచిపోయిననూ (2)
ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ నను నీవు విడువలేదయ్యా (2)
3. నీవు లేకుండ నేనూ – ఈ లోకంలో బ్రతుకలేనయ్యా (2)
నీతో కూడా ఈ లోకం నుండీ పరలోకం చేరెదనేసయ్యా (2)
(Yentha Manchi Devudavayya Yentha Manchi Devudavesayya)