ఊహించలేనయ్యా వివరించలేనయ్యా ఎనలేని నీ ప్రేమను

ఊహించలేనయ్యా వివరించలేనయ్యా – ఎనలేని నీ ప్రేమను (2)

నా జీవితాంతం ఆ ప్రేమలోనే (2)

తరియించు వరమే దొరికెను (2)

1. నా మనసు వేదనలో – నాకున్న శోధనలో – ఉల్లాసమే పంచెను

     ఓ మధుర భావనలో – తుదిలేని లాలనలో

     మధురామృతమునే నింపెను (2)

     అనాధైన నను వెదకెను ప్రధానులతో ఉంచెను (2) ఓ..ఓ..ఓ..ఓ..

2. నీ మరణ వేదనలో – నీ సిలువ శోధనలు – నీ ప్రేమ రుజువై నిలిచెను

     వెలలేని త్యాగముతో – అనురాగ బోధలతో

     నా హృదయమే కరిగెను (2)

     ఇది నీ ప్రేమకే సాధ్యము – వివరించుట నాకసాధ్యము (2) ఓ..ఓ..ఓ..ఓ..

(Uhinchalenayya Vivarinchalenayya Yenaleni Nee Premanu)