ఇరువది నలుగురు పెద్దలతో – పరిశుద్ధ దూతల సమూహముతో (2)
నాలుగు జీవుల గానముతో (2) – స్తుతియింపబడుచున్న మా దేవా
1. భూమ్యాకాశములన్నియును – పర్వత సముద్ర జల చరముల్ (2)
ఆకాశ పక్షులు అనుదినము (2) – గానము చేయుచు స్తుతియింపన్
2. కరుణారసమయ హృదయుడవు పరిశుద్ధ దేవ తనయుడవు (2)
మనుజుల రక్షణ కారకుడా (2) – మహిమ కలిగిన మా ప్రభువా
3. గుప్పిలి విప్పి కూర్మితోను గొప్పగ దీవెనలిచ్చెదవు (2)
గొర్రెల కాపరి దావీదు (2) – అయ్యెను ఎంతో మహారాజు
(Iruvadi Naluguru Peddalatho)