ఇమ్మానుయేలు రక్తము – ఇంపైన యూటగు
ఓ పాపి యందు మున్గుము – పాపంబు పోవును
“అను పల్లవి”
యేసుండు నాకు మారుగా – ఆ సిల్వ జావగా
శ్రీ యేసు రక్తమెప్పుడు – శ్రవించు నాకుగా
1. ఆ యూట మున్గి దొంగయు – హా శుధ్ధుడాయెను
నేనట్టి పాపినిప్పుడు – నేనందు మున్గుదున్ ||యేసుండు||
2. నీ యొక్క పాపమట్టిదే – నిర్మూలమౌటకు
రక్షించు గొర్రెపిల్ల – నీ రక్తము చాలును ||యేసుండు||
3. నా నాధు రక్తమందున – నే నమ్మియుండినన్
నా దేవుని నిండు ప్రేమ – నేనందు చూచేదన్ ||యేసుండు||
4. నా యాయుష్కాలమంతట – నా సంతసంబిదే
నా క్రీస్తుయొక్క రొమ్మునన్ – నా గానమిదియే ||యేసుండు||
(Immanuyelu Rakthamu Impaina Yutagu)