ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో

ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము
చల్లని దేవుని నీడలో
గతించిపోయే కాలం – స్మరించు యేసు నామం
సంతోషించు ఈ దినం

1. లోకమే నటనాలయం
జీవితమే రంగుల వలయం (2)
పరలోకమే మనకు శాశ్వతం
పరలోక దేవుని నిత్య జీవం
ప్రేమామయుడే ఆ పరమాత్ముడే
పదిలపరచెనే రక్షణ భాగ్యం “ఇన్నేళ్లు”

2. మారు మనస్సు మనిషికి మార్గం
పశ్చాత్తాపం మనసుకు మోక్షం (2)
నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా
నీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమా
పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే
కరుణించునే కలకాలం “ఇన్నేళ్లు”

(Innellu Ilalo Vunnamu Manamu Challani Devuni Needalo)