ఆహా మహాత్మ హా శరణ్యా హా విమోచకా
ద్రోహ రహిత చంపె నిను నా దోషమే గదా
1 వీరలను క్షమించు తండ్రి నేర రేమియున్
కోరి తిటులు నిన్ను జంపు క్రూర జనులకై
2 నీవు నాతో బరదైసున నేడె యుందువు
పావనుండ యిట్లు బలికి పాపి గాచితి
3 అమ్మా! నీ సుతుడ టంచు మరియమ్మతో బలికి
క్రమ్మర నీ జనని యంచు గర్త నుడివితి
4 నా దేవ దేవ యేమి విడ నాడితి వనుచు
శ్రీ దేవ సుత పలికితివి శ్రమ చెప్పశక్యమా
5 దప్పికొనుచున్నా నటంచు జెప్పితివి గద
యిప్పగిదిని బాధనొంద నేమి నీకు హా!
6 శ్రమ ప్రమాదములను గొప్ప శబ్ద మెత్తి హా
సమాప్తమైన దంచు దెలిపి సమసితివి గదా
7 అప్పగింతు తండ్రి నీకు నాత్మ నంచును
గొప్ప యార్భాటంబు చేసి కూలిపొతివా
(Aahaa Mahaatma Haa Sharanyaa Haa Vimochakaa)