1. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీశ
ఆశతో నమ్మి యున్నాము నీ సత్య వాగ్దత్తము
“అను. ప” ఇమ్మాహి మీద క్రుమ్మరించుము దేవా
క్రమ్మర ప్రేమ వర్షంబున్ గ్రుమ్మరించుము దేవా
2. ఓ దేవా పంపింపవయ్యా నీ దీవెన ధారలన్
మా దాహమెల్లను బాపు మాధుర్యమౌ వర్షమున్ || ఇమ్మాహి ||
3. మా మీద కురియించు మీశ ప్రేమ ప్రవాహంబులన్
సమస్త దేశంబు మీద క్షామంబు పోనట్లుగన్ || ఇమ్మాహి ||
4. ఈనాడే వర్షింపు మీశ నీ నిండు దీవెనలన్
నీ నామమందున వేడి సన్నుతి బ్రౌర్ధింతుము || ఇమ్మాహి ||
(Aasirvadambul Maameeda Varshimpajeyumeesa)