ఆశీర్వదించుము దేవా – ఆదరణ నీవే ప్రభువా -2
అనుదినము నీ కృపయే చాలు – అనుక్షణము నీకే మా స్తుతులు – 2
1. ఆపత్కాలములో సహాయకుడవు నీవు – అందరినీ ప్రేమించే యేసు నాధుడవు -2
ఆశ్రయ దుర్గము నీవే – ఆనంద తైలము నీవే – 2
ఐశ్వర్యము నీవే మా ఘనతయు నీవే – 2
2. నీ యందు భయభక్తులు గలవారి యెడల
దయ చూపుచున్నావు తరతరముల వరకు -(2)
నీ యందు భయభక్తులు గలవారి పిల్లలు – 2
నీరు కట్టు తోటవలె బహుగా ఫలింతురు – 2
3. తొట్రిల్లనియ్యవు మా పాదములను – తోడై నీడై మా త్రోవకు వెలుగై (2)
కాపాడుచున్నావు కనుపాపవలెను – 2
కడవరకు విడువకను నడిపించెదవు – 2
(Aasirvadinchumu Devaa Aadarana Neeve Prabhuvaa)