ఆరాధించెదను నిన్ను
నా యేసయ్యా ఆత్మతో సత్యముతో (2)
ఆనంద గానముతో ఆర్భాట నాదముతో – 2
1. నీ జీవ వాక్యము నాలో – జీవము కలిగించే – 2
జీవిత కాలమంతా – నా యేసయ్యా నీకై బ్రతికెదను – 2
2. చింతలన్ని కలిగిననూ – నిందలన్ని నన్ను చుట్టినా – 2
సంతోషముగ నేను – నా యేసయ్యా నిన్నే వెంబడింతును – 2
(Aaraadhinchedanu Ninnu Naa Yesayya Aaathmato Satyamutho)