ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదను
నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను (2)
ఆరాధన ఆరాధన (2)
నీ మేలులకై ఆరాధన – నీ దీవెనకై ఆరాధన (2)
ఆరాధన ఆరాధన (2)
1. దినమెల్ల నీ చేతులు చాపి – నీ కౌగిలిలో కాపాడుచుంటివే (2)
నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై
నా పూర్ణ హృదయముతో సన్నుతింతును (2)
ఆరాధన ఆరాధన (2)
నీ ప్రేమకై ఆరాధన – నీ జాలికై ఆరాధన (2) ఆరాధన ఆరాధన (2)
2. ధనవంతులుగా చేయుటకు – దారిద్ర్యత ననుభవించినావు (2)
హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా
పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను (2) ఆరాధన ఆరాధన (2)
నీ కృప కొరకై ఆరాధన – ఈ స్థితి కొరకై ఆరాధన (2)
ఆరాధన ఆరాధన (2)
(Aaraadhanaku Yogyudaa Nithyamu Sthutiyinchedanu)