ఆరని ప్రేమ ఇది – ఆర్పజాలని జ్వాల ఇది (2)
అతి శ్రేష్టమైనది – అంతమే లేనిది
అవధులే లేనిది – అక్షయమైన ప్రేమ ఇది (2)
కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది (2)
1. సింహాసనము నుండి – సిలువకు దిగి వచ్చినది
బలమైనది మరణము కన్నా – మృతిని గెల్చి లేచినది (2)
ఇది సజీవమైనది – ఇదే సత్యమైనది
ఇదే నిత్యమైనది – క్రీస్తు యేసు ప్రేమ ఇది (2)
కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది (2)
2. నా స్థానమందు నిలిచి – నా శిక్షనే భరియించి
క్రయ ధనమును చెల్లించి – గొప్ప రక్షణ నిచ్చినది (2)
నాకు విలువను ఇచ్చినది – నన్ను వెలిగించినది
ఆ ఉన్నత రాజ్యమందు – నాకు స్థానమిచ్చినది (2)
ఉన్నత ప్రేమ ఇది – అత్యున్నత ప్రేమ ఇది (2)
3. భూ రాజులు అధిపతులు – రాజ్యాలు అధికారాలు
చెరయైనా ఖడ్గమైనా – కరువైనా ఎదురైన (2)
ఎవరు ఆపలేనిది – ఎవరు ఆర్పలేనిది
ప్రవహించుచున్నది – ప్రతి పాపి చెంతకు (2)
ప్రేమ ప్రవాహమిది – యేసు ప్రేమ ప్రవాహమిది (2)
(Aarani Prema Idi Aarpajaalani Jvaala Idi)