ఆయనే నా సంగీతము – బలమైన కోటయును
జీవాధిపతియు ఆయనే – జీవితకాలమెల్ల స్తుతించెదను
1. స్తుతుల మధ్యలో నివాసం చేసి – దూత లెల్ల పొగడే దేవుడాయనే
వేడుచుండు భక్తుల స్వరము విని – దిక్కులేని పిల్లలకు దేవుడాయనే
2. ఇద్దరు ముగ్గురు నా నామమున – ఏకీభవించిన వారి మధ్యలోన
ఉండెదననిన మనదేవుని – కరములు తట్టి నిత్యము స్తుతించెదము
3. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున – జీవిత కాలమెల్ల కీర్తించెదము
రాకడలో ప్రభుతో నిత్యముందుము – మ్రొక్కెదము స్తుతించెదము పొగడెదము
(Aayane Naa Sangeethamu Balamaina Kotayunu)