ఆదరించు యేసయ్యా ఆరాధ్య దైవమా

ఆదరించు యేసయ్యా ఆరాధ్య దైవమా

ఆశ్రయ పురమా నా యేసు రాజా  – (2)

అను పల్లవి:       ఆరాధన ఆరాధనా, ఆరాధన ఆరాధనా,  

                           ఆరాధన ఆరాధనా, హల్లెలూయా హల్లేలూయా

1. దాస్యము నుండి విడిపించినావు – స్వాస్థ్యములోనికి నడిపించినావు – 2

     ఆరిన నేలపై నడిపించినావు – 2

2. పాత వత్సరమున కాపాడినావు – క్రొత్త వత్సరమును నాకిచ్చినావు – 2

     నాతో ఉండి నను కాచినావు – 2

3. శోధనలెన్నో తప్పించినావు – కృపవెంబడి కృపతో నింపినావు – 2

     నిత్య జీవము నాకిచ్చినావు – 2

(Aadarinchu Yesayyaa Aaraadhya Daivamaa Aasraya Puramaa)