ఆకర్షించుము దేవా మమ్మాదరింపగ రావా

ఆకర్షించుము దేవా మమ్మాదరింపగ రావా

కాంక్షనీయుడా నీవే మా దేవ – కాపరి మా యేసు దేవా

1. సాతాను శోధనలు మములాగుచున్నవి దేవా

     కష్టాలు కన్నీళ్ళు మా గుండె నిండెను దేవా

     లోకము మమ్ము పిలుచుచున్నది – శోకసముద్రం పొంగుచున్నది

2. నీ ఆత్మ వరములను మాకిమ్ము మా యేసు దేవ

     నీ సేవ చేయుటకు మా శక్తి చాలదు దేవా

     సుఖము శరీరము కోరుచున్నది – మనస్సు ధనాశకు లాగుచున్నది

3. మా ప్రియుడా నడుపుమయా – నీ ప్రేమ నీడలలోన

    పాలు గోధుమ సారములు ఉన్నాయి – నీ సన్నిధాన

     పాపపు చెలిమి పిలుచుచున్నది – చీకటి బలము లాగుచున్నది

4. జీవజలాల ఊటలతో మా తోట తడుపుము దేవా

     తియ్యని తేనీయ మాటలతో మా నోరు నింపుము దేవా

     సుమమధుర సహవాసముతో సాగెద నిరతము నీ సేవలో  

(Aakarshinchumu Devaa Mammaadarimpaga Raavaa)