అమ్మకన్న మిన్నగా ప్రేమించితివి

అమ్మకన్న మిన్నగా ప్రేమించితివి – నమ్మదగిన దేవుడవు నాకు తండ్రివి

అను పల్లవి:   వెంబడించెదం విశ్వాసముతో  వెంటవచ్చెదం యేసు నీతో

1. మార్గమును ఏర్పరచినవాడవు నీవు

     సరియైన మార్గములో నడిపించెదవు

2. హృదయమును ఎరిగియున్న జ్ఞానివి నీవు

     సమయోచిత జ్ఞానమును దయచేసెదవు

3. యుద్దమును జరిగించు రాజువు నీవు

     శత్రువుల చేతినుండి రక్షించెదవు

4. ప్రాణమును అర్పించిన కాపరి నీవు

     నిదురపోక నన్ను నీవు కాపాడెదవు

(Amma Kanna Minnagaa Prminchithivi Nammadagina Devudavu)