అపరాధిని యేసయ్యా కృప జూపి బ్రోవుమయ్యా
నెప మెంచకయే నీ కృపలో నపరాధములను క్షమించు
1. సిలువకు నిను నే గొట్టితిని తులువలతో జేరితిని
కలుషంబులను మోపితిని దోషుoడ నేను ప్రభువా
2. ప్రక్కలు బల్లెపు పోటు గ్రక్కున పోడిచితి నేనే
మిక్కిలి బాధించితిని మక్కువ జూపితివయ్యో
3. ముళ్ళతో కిరీటంబు నల్లి నీ శిరమున నిడితి
నా వల్ల నేరమాయె చల్లని దయగల తండ్రీ
4. ఘోరంబుగా దూరితిని నేరంబులను జేసితివి
క్రూరుoడనై గొట్టితిని ఘోరంపు పాపిని దేవా
(Aparaadhini Yesayya Krupajupi Brovumayya)