అన్నివేళలా ఆదరించెడి ఆత్మరూపీ నీకే వందనం

అన్నివేళలా ఆదరించెడి ఆత్మరూపీ నీకే వందనం

ఎన్ని తీరుల నిన్ను కొలిచినా తీర్చలేను నేను నీ ఋణం

1.పడిపోయియుండగా నను తిరిగి లేపితివి

స్థిరపరచి దీవించగా నీ కరము చాపితివి

పోగొట్టుకున్నదంత ఇచ్చితివి – రెట్టింపు శోభ మరల తెచ్చితివి

2.నిను వెంబడించగా శ్రమలెన్నో కలిగినా

సువార్త చాటించగా ఉన్నవన్నీ పోయినా

నూరంతల దీవెనలు పంపెదవు – సమృద్ధితో నను నింపెదవు

(Anni Velalaa Aadarinchedi Aathmaroopi Neeke Vandanam)